News

తెలంగాణ బడ్జెట్


తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ బుధవారం 2015-16 బడ్జెట్ ప్రవేశపెట్టారు.తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం గర్వంగా ఉందని ఈటెల రాజేందర్ పేర్కొన్నారు.ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ఉంటుందన్న ఆయన తెలంగాణ అమరవీరులకు జోహార్లు అర్పించారు. తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు అవకాశం ఇచ్చిందనకు ఈటెల కృతజ్ఞతలు తెలిపారు.  ప్రతీ పైసా తెలంగాణ ప్రజల సర్వతోముఖాభివృద్ధికి కేటాయిస్తామని, బడ్జెట్ అంటే చిట్టాపద్దుల పట్టిక కాదని, జీవం లేని అంకెల కూర్పు కాదని.. సారం లేని గణాంకాలు అంతకన్నా కాదన్నారు.  బడ్జెట్ తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చే బడ్జెట్ అని తెలిపారు.  సంక్షేమం, వ్యవసాయం, ఉపాధి కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని ఈటెల ప్రకటించారు.